కనిగిరి కోర్టు ఆవరణలో డిసెంబర్ 9వ తేదీన జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు పామూరు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పామూరు సర్కిల్ పరిధిలో రాజీ చేసుకోదలసిన కేసులు, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు లోక్ ఆదాలత్ లో పరిష్కరించుకోవచ్చని సీఐ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పామూరు సర్కిల్ పరిధిలోని ప్రతి కక్షిదారుడు వినియోగించుకోవాలని సీఐ తెలిపారు.