వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "సంగం డెయిరీని సర్కారు కబ్జా చేయాలని చూసినా సాధ్యం కాలేదు. కబ్జాలకు అడ్డుపడిన ధూళిపాళ్లపై జగన్ కక్షగట్టారు.
ధూళిపాళ్లపై తప్పుడు హత్యాయత్నం కేసు పెట్టించారు. కేసులో ధూళిపాళ్ల హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ వచ్చే లోపే అక్రమ అరెస్టుకు యత్నిస్తున్నారు." అంటూ మండిపడ్డారు.