ఢిల్లీలో తప్పుడు కేసు పెట్టిన మహిళకు కోర్టు లక్ష జరిమానా విధించింది. ఓ మహిళ తన ఐదేళ్ల కూతురిపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుల పై పోక్సో కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
ఆపై కేసు దర్యాఫ్తు చేయగా ఆమెకు నిందితులతో ఆస్తి తగాదాలు ఉండటంతోనే ఈ ఆరోపణలు చేసిందని పోలీసులు తేల్చారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి సుశీల్ బాల డాగర్ మహిళకు లక్ష జరిమానా విధించాలని ఆదేశించారు.