జీతం అడిగినందుకు ఓ మాజీ ఉద్యోగిని నోటితో చెప్పులు మోయించారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. రనిబా ఇండస్ట్రీస్‌లో నీలేష్ దుల్సానియా అనే ఉద్యోగి పని మానేశాడు. కంపెనీ నుంచి తనకు రావాల్సిన 17 రోజుల జీతం కోసం ఆఫీస్‌కు వెళ్లాడు.
అక్కడికి వెళ్లి జీతం అడిగిన నీలేష్‌ను కంపెనీ యజమాని విభూతి పటేత్ తన సిబ్బందితో దాడి చేయించింది. అంతటితో ఆగకుండా అతడి నోటితో చెప్పులు మోయించి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తానని బెదిరించింది.