ఢిల్లీని గత కొంత కాలంగా వాయుకాలుష్యం వెంటాడుతోంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత వ్యాధులతో చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారు.
ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు, రాత్రి వేళలో గాలి వేగం తగ్గడం గాలి నాణ్యత పడిపోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈరోజు 401 పాయింట్లుగా నమోదై ప్రమాదకరంగా మారింది.