పేద,బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి జగనన్న. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాపత్రయంతో సంక్షేమపథకాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఆమె మాట్లాడుతూ.... రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, అణగారిన వర్గాలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది. అందుకే 2019లో ఆయన వెన్నువిరిచి మూల కూర్చోబెట్టారు ప్రజలు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంపై దృష్టిపెట్టి, అంబేడ్కర్, ఫూలేల ఆదర్శాలను పాటిస్తూ, వైయస్సార్ ఆశయాల బాటలో ముందుకు సాగుతూ...ఓవైపు సామాజిక సాధికారత సాధించడంతో పాటు, పేదలు, అణగారిన వర్గాల ఆర్థిక స్థాయి పెంచుతున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు.