మనమంతా జగనన్న కుటుంబసభ్యులం. సంక్షేమ పథకాల లబ్దిని నేరుగా పేదలకు అందేలా చేస్తున్నారు జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. అయన మాట్లాడుతూ... మధ్య దళారులు లేకుండా చేయడం ద్వారా, పథకాలు పారదర్శకంగా లబ్దిదారులకు అందేలా చేయడం జగనన్న లక్ష్యం. నవరత్నాల ద్వారా రాష్ట్రప్రజల శ్రేయస్సు కోసం జగనన్న అందిస్తున్న సాయం అంతా ఇంతా కాదు. అణగారిన కులాల పట్ల చిన్నచూపు ఉన్న వాడు చంద్రబాబు. కానీ జగనన్న పేదబిడ్డలు, ధనవంతుల పిల్లలకు తీసిపోరాదని గట్టిగా భావించారు . ఆ దిశలోనే ఆయన విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మన బిడ్డలకు ఇంగ్లీషు చదువులు అందుబాటులోకి తెచ్చారు. కులాలకతీతంగా మన ఆర్థిక, సామాజిక స్థాయి పెంచేలా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్రెడ్డి అని తెలిపారు.