మత్స్యకారులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటోందని, ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అయన మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మత్సకారుల డీజిల్ బకాయిలు కూడా చెల్లిస్తామని, త్వరలో ఆ బకాయిలు రూ.4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయాలని సీఎం ఆదేశించారన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారని, పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ అవేం పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారన్నారు. రాజకీయాలకు అతీతంగా బోటు విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని చెప్పారన్నారు. కలాసీలకు పరిహారం ఇవ్వాలని చెబితే వెంటనే పది వేలు చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసిందన్నారు. స్టీల్ బోట్లు తయారీకి ఇప్పుడు 60 శాతం సబ్సిడీ ఇస్తోందని, ఇప్పుడు దరఖాస్తు చేస్తే లాంగ్ లైనర్ల కోసం 75 శాతం వరకు ఇస్తామమన్నారు.