విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం మానవ తప్పిదం అయినప్పటికీ బాధిత మత్స్యకారులను ఆదుకోవడంలో సీఎం వైయస్ జగన్ తన ఉదారత చాటుకున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. అయన మాట్లాడుతూ.... పరిహారం ఇవ్వడంలో సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. 150 కోట్లతో హార్బర్ ఆధునీకరణ గొప్ప నిర్ణయమని, ఇన్ని జట్టీలు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. ఫిషింగ్ జట్టీల ఏర్పాటుతో ఆర్థిక ప్రగతి ఉంటుందని చెప్పారు. ఈ రోజు ఇచ్చిన పరిహారం అంచనాలకు తగ్గట్టు అధికారులు ఇచ్చారని, ఈ పరిహారం వృథా చేయకుండా లాంగ్ లైనర్ బోట్లను కొనుగోలు చేయాలన్నారు. బోట్ల కొనుగోలుకు బ్యాంకులు సహకరించేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని, రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు వస్తారు.. వారికి నమ్మొద్దని సూచించారు.