విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాద బాధితులను వైయస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది. బోట్లు కోల్పోయిన మత్స్యకారులను సత్వరమే సాయం అందింది. ఫిషింగ్ హార్బర్‌లో అగ్రి ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితులకు వైయస్ జగన్ ప్రభుత్వం పరిహారం చెక్కులను అందజేసింది. అగ్నిప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మత్స్యకారులకు నేనున్నానని భరోసానిచ్చారు. బాధిత మత్స్యకారులకు 80శాతం పరిహారం ఇస్తామని ప్రకటించారు. సీఎం వైయస్ జగన్ చెప్పినట్లుగానే ప్రమాదం జరిగిన 48గంటలు గడవక ముందే జిల్లా కలెక్టర్ డాక్టర్ అకౌంట్‌కు పరిహారం డబ్బులను సీఎం కార్యాలయం జమ చేసింది. పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించింది. అంతే కాకుండా బోట్లు దగ్ధమవడంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలు, చిరువ్యాపారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.10వేలు చొప్పున అందించారు.