బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిన్న జరిగింది. సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాది మంది జనం కదలివచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగనన్న అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను బహిరంగ సభలో బడుగు వర్గాలకు చెందిన నేతలు తెలియచేస్తుంటే ప్రజలు హర్షధ్వానాలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కురసాల కన్నబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.