అంబేద్కర్ దగ్గర నుంచి జ్యోతిరావు పూలే, సాహూ మహరాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, జగ్జీవన్‌రామ్ లాంటి వారు సామాజిక సాధికారత కోసం విప్లవాలు చేశారు. ఏపీలోగానీ, భారతదేశంలోగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు వారి స్థితిగతుల కోసం ఆలోచించిన నాయకులు కరువయ్యారు. ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు భరోసా, ధైర్యం వచ్చాయి అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అయన మాట్లాడుతూ.... సమాజంలో అసమానతలు తొలిగాయి. రాజ్యాధికారం వచ్చేలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, డబ్బులు అందించి గుండెమీద చెయ్యి వేసుకొని పేదవారు బతకడానికి అవకాశాలు వచ్చాయి. మన పిల్లలు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ చదువుతున్నారు. 31 లక్షల పట్టాలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందుతున్నాయి. రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా పేదవారికి అందిస్తే అగ్రతాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కింది. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు చంద్రబాబు. బీసీ కులాల తోకలు కత్తిరిస్తాన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారన్నాడు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని బాబు. ఎస్టీ కమిషన్ ఇవ్వలేదు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు చేయించాడు. 2014లో మూడు పార్టీలు వచ్చాయి. 648 వాగ్దానాలిచ్చాయి. ఒక్కటీ నెరవేర్చలేదు. చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. పేదల కోసం, భావితరలాల భవిష్యత్ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగనన్న. 11.5 శాతం ఉండే పేదరికం 6 శాతానికి తగ్గిందంటే జగనన్న పేదల కోసం ఎంతగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న సీఎం కావడం అవసరం. 2024 ఎన్నికల్లో మనం తప్పు చేస్తే మన గొయ్యి మనమే తవ్వుకుంటాం అని అన్నారు.