70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు కేబినెట్‌లో ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న అని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. అయన మాట్లాడుతూ.. డైరెక్టర్ పదవులు వెతికి వెతికి బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారు. అలాంటి ఆలోచన చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా.. నాలుగేళ్లలో రూ.7 లక్షల కోట్లు రాష్ట్రానికి బడ్జెట్ ఉంటే రూ.4.15 లక్షల కోట్లు ఈ వర్గాలకే ఇచ్చారు. లాంతరు పెట్టి వెతికినా గతంలో బడుగు వర్గాల్లో ఇంజనీరు, డాక్టరు కనిపించేవారు కాదు. ఈరోజు ప్రతి ఇంట్లో ఇంజనీరు,డాక్టర్ ఉన్నారంటే కారణం వైయస్సార్. ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చి చదువుకొనే అవకాశం కల్పించారు. ఇంటి స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారు. రాజధానిలో సోషల్ డెమోగ్రఫీ చెడిపోతుందన్నారు. 30 లక్షల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న జగనన్న. మహిళలంటే పొలాల్లో కోతలకే, వంటింటికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతి పథకాన్నీ మహిళ పేరు మీద పట్టా, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము తల్లి పేరుమీద ఖాతాలో వేస్తున్నారు. గతంలో పార్టీ, కులం చూసేవారు. మనకు ఓటు వేస్తారా అని చూసేవారు. మన కులాలను బానిసలుగా భావించేవారు. ఈరోజు ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన పని లేదు. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని తెలిపారు.