76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారతను నినాదంగా కాకుండా, ఒక విధానంగా మార్చేసిన గొప్ప ముఖ్యమంత్రి మన జగన్‌మోహన్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. అయన మాట్లాడుతూ.... పేదలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సంక్షేమంలో అగ్రపీఠం.. సీఎం వైయస్ జగన్ సర్కార్‌లోనే దక్కింది. మునుపెన్నడూ లేని చరిత్రను వైయస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించింది. అణగారిన వర్గాలను సొంతం చేసుకొని, వారి ఉన్నతికి విశేషంగా కృషి చేస్తోంది. ఈ కడప గడ్డపై రెండుసార్లు ఎమ్మెల్యేను చేయడమే కాదు, మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి. అక్కడితో ఆగలేదు. నాకు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి స్థాయి పెంచారు జగనన్న. చంద్రబాబు హయాంలో ఒక్క మైనార్టీ సోదరుడికి అధికార పదవుల్లో అవకాశం లేదు. కానీ జగనన్న హయాంలో మైనార్టీలకు అటు శాసనసభ, శాసనమండలి, కార్పొరేషన్లలో పదవులు వచ్చాయి. నమ్మించి మోసం చెయ్యడం చంద్రబాబు నైజం. నమ్మినవారికోసం ఎంతదూరమైన వెళ్లడం జగనన్న నైజం. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది. గతంలో కేవలం మాటలకే పరిమితమైన సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపెట్టింది జగనన్న ప్రభుత్వమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నత స్థాయే లక్ష్యంగా పనిచేస్తోంది జగనన్న ప్రభుత్వం. కడప జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా రూ.7,984.48 కోట్లు అందించారు జగనన్న. అందులో ఎస్సీలకు రూ.2000.92 కోట్లు, ఎస్టీలకు రూ.212.47 కోట్లు, మైనార్టీలకు రూ.508 కోట్లు అందాయి. కడప నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే..అది మనపై జగనన్నకు ఉన్న ప్రేమకు నిదర్శనం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడుపుతున్న జగనన్నకు మనమంతా అండగా ఉందాం అని పిలుపునిచ్చారు.