బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వేదికపై ఆ వర్గాలకు చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారంటే ...ఇక జగనన్న హయాంలో జరిగిన సామాజిక సాధికారత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అయన మాట్లాడుతూ.... మాటలతో కాకుండా, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపిన జగనన్న నిజమైన పాలకుడు. మన నాయకుడని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న అన్ని రంగాలలో, అన్ని కులాలవారికి సమన్యాయం చేశారు. డప్పుకార్మికులకు, చేనేత వర్గాలకు, చర్మకారులకు, మత్స్యకారులకు ఇలా ఒకటేమిటి అన్ని అణగారిన వర్గాలకు చెయ్యిపట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు జగనన్న. అంబేడ్కర్, మహాత్మఫూలే ఆశయాలనే ఆదర్శంగా తీసుకుని...సామాజిక సాధికారత విషయంలో రోల్‌మోడల్‌గా మారారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. జగనన్నే మన విశ్వాసం. జగనన్నే మన నమ్మకం. మీకు మంచి జరిగివుంటేనే నాకు మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించండి అని జగనన్న చెబుతున్నాడు. ఆయన మనకు మంచి చేశాడు. మనం ఆయనకు అండగా ఉండితీరాలి. జగనన్న గుండెల్లో కడప ప్రజలు ఉన్నారన్నది మరిచిపోవద్దు. ఇక్కడ నుంచి ఒక ఉపముఖ్యమంత్రిని తయారు చేశారంటే ..కడప జనం జగనన్నకు ఎంతగా రుణపడిపోయారో అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు గమనిస్తే...కడప నియోజకవర్గానికి జరుగుతున్న మంచి ఎంతో తెలుస్తుంది అని తెలియజేసారు.