నంద్యాల జిల్లా శ్రీశైలంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మకూరు మండలం నల్ల కాల్వ వద్ద వైయస్ఆర్ స్మృతి వనంలో తటస్థులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ప్రతినిధులతో సమావేశం అనంతరం వైయస్ఆర్ స్మృతివనం నుంచి ఆత్మకూరు వరుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆత్మకూరు గౌడ్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, తదితరులు హాజరుకానున్నారు.