దేశంలో మనం ఎన్నో పార్టీలు చూశాం. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. సామాజికన్యాయం పాటిస్తామన్నవారే కానీ. సామాజిక న్యాయం చేసిన పాపాన పోలేదు అని వైసీపీ నేత మేయర్ సురేష్ అన్నారు. అఖిలేష్‌యాదవ్, నితీష్‌కుమార్, కుమార్స్వామిలు..ఇలా ఎందరో బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా చేశారు. ఎస్సీలున్నారు. ఇప్పటికీ పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. కానీ ఎవ్వరూ సామాజిక న్యాయం విషయంలో జగనన్నలా ఆలోచించలేదు. ఆ దిశలో అడుగులు వేయలేదు. కులం,మతం, ప్రాంతం చూడని జగనన్న హయాంలో, అణగారిన వర్గాలకు చెందిన ఎంతోమంది రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. అధికారపదవులు పొందారు అని తెలిపారు.