చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, జైల్లో పెట్టాలనే టార్గెట్‌తో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పని చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న ‘టార్గెట్ చంద్రబాబు’ ఆపరేషన్‌కు సహకరించే అధికారులకు రివార్డులు, అవార్డులు ఇస్తున్నారని, సహకరించని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులకు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, జగన్‌రెడ్డి టార్గెట్‌కు వత్తాసు పలక వద్దని, చట్టానికి వ్యతిరేకంగా పని చేసే ప్రతి అధికారీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వర్ల హెచ్చరించారు.