బంగాళాఖాతం దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ నెల 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa