ఏపీ గిరిజన విద్యార్థులకు అమెరికాలో జరిగే రెండు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించింది. వచ్చే ఏడాది మార్చి 5న వాషింగ్టన్ లో నిర్వహించే నానో టెక్నాలజీ సింపోజియానికి ప్రతినిధులుగా 10 మంది విద్యార్థులను తీసుకురావాలని యూఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ షకీన్ కుమార్ కు నిర్వాహకులు లేఖ రాశారు. మార్చి 11 నుంచి 22 వరకు జరిగే కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ 68వ వార్షికోత్సవానికి కూడా ఆహ్వానం అందింది.