మూడు రోజుల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం అతడిని అధికారులు విచారించగా.. లంచ్ సమయంలో వారి కళ్లుగప్పి పారిపోయారు. ఆయన కోసం మూడు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. అయితే శనివారం రాత్రి చెన్నైలోని ఓ లాడ్జిలో శ్రీనివాసులు నాయక్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.