దివంగత బ్రిటీష్ కవి ఎడ్వర్డ్ జేమ్స్ తన భార్య టిల్లీ లోష్ మీద ప్రేమతో ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. మెట్లపై ఆమె నడిచిన పాదముద్రలను ఆర్ట్‌గా మార్చేశాడు. టిల్లీ లోష్ తడి కాళ్లతో మెట్లపై వెళ్తున్న సందర్భంలో ఆమె పాద ముద్రలను చూసి చలించిపోయాడట. ఆమె పాదముద్రలను శాశ్వతంగా ఉంచాలనుకున్నాడు. దాంతో మెట్లపై కార్పెట్ ఏర్పాటు చేసి ఆమె పాదాలను ఆర్ట్‌గా మార్చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.