భారతీయ రైల్వేల పనితీరు పేలవంగా ఉండడానికి ప్రధానంగా ఐదు కారణాలు కన్పిస్తున్నాయి. కాగ్ నివేదిక ప్రకారం 2021-22లో రైల్వేల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాని నిర్వహణ నిష్పత్తి 107.39%కి చేరుకుంది. దీని అర్థం ఏమంటే వంద రూపాయలు సంపాదించడానికి రైల్వేలు రూ.107కు పైగా ఖర్చు చేస్తున్నాయి.
ఈ పరిస్థితికి కోవిడ్ కారణమని చెప్పి తప్పించుకునేందుకు ప్రారంభంలో రైల్వేలు ప్రయత్నించా యి. వాస్తవానికి కోవిడ్‌కు ముందు… 2016లోనే నిర్వహణ నిష్పత్తి దారుణంగా ఉంది. అప్పటి నుండి అది వంద శాతానికి చేరువలోనే కొనసాగింది. మిగులు ఆదాయాన్ని పొందడంలో రైల్వేలు ఘోరంగా విఫలమయ్యా యని ఆ శాఖ ఖాతా పుస్తకాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. మిగులు మాట అటుంచి పరిస్థితి లోటులోకి దిగజారిపోతోంది.