రైల్వేలో నిర్వహణ అధ్వాన్నంగా ఉంటోంది. కాగ్ నివేదిక ప్రకారం రైల్వేలో రూ.94,873 కోట్ల విలువైన పాత ఆస్తులు ఉన్నాయి. ఈ మొత్తాన్ని తరుగుదల రిజర్వ్ నిధి నుండి పొందాల్సి ఉంటుంది. ఇందులో 60% నిధులు అంటే రూ.58,459 కోట్లు పట్టాల నవీకరణకు అవసరమవుతాయి.
అయితే ఇందుకోసం రూ.671.92 కోట్లు అంటే 0.7% నిధుల్ని మాత్రమే వెచ్చించారు. 2015లో ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి సంవత్సరం 4,500 కిలోమీటర్ల మేర పట్టాలను ఆధునీకరించాల్సి ఉంటుంది. అయితే అప్పటి నుండి 2021-22 వరకూ ఏ ఒక్క సంవత్సరంలోనూ ఆ పని జరగలేదు.