రైల్వే శాఖ ఓ పద్ధతి ప్రకారం అనేక రైళ్లలో స్లీపర్, సెకండ్ క్లాస్ బోగీల సంఖ్యను తగ్గించివేస్తోంది. వాటి స్థానంలో ఏసీ బోగీలను ప్రవేశపెడుతోంది. దీనివల్ల జనరల్ బోగీల్లో ప్రయాణించే వారు నరకం అనుభవించాల్సి వస్తోంది. ఈ బోగీల్లో సీటు సంగతి అటుంచితే కనీసం నిలబడడానికి కూడా ఖాళీ ఉండడం లేదు. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఏసీ బోగీల్లో ప్రయాణించే పరిస్థితి లేదు. ఆ బోగీల్లో ఛార్జీలు వారికి అందుబాటులో ఉండవు. ఇలాంటి వారి కోసం రైల్వేలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు.
జనరల్ టిక్కెట్ ఉన్న వారు రిజర్వేషన్ బోగీల్లో ప్రవేశించి ప్రయాణించడం సర్వసాధారణమై పోయింది. మధ్య, ఉత్తర, పశ్చిమ రైల్వే జోన్లలో రైళ్లలో ఏసీ బోగీల సంఖ్య బాగా పెరుగుతోంది. దక్షిణ, తూర్పు రైల్వే జోన్లలో పెరుగుదల ఆ స్థాయిలో లేదు. నాన్-ఏసీ బోగీల సంఖ్యను తగ్గించడంతో పాటు కోవిడ్ తర్వాత అన్-రిజర్వ్‌డ్ జన్ సాధారణ్ రైళ్లను పూర్తిగా నిలిపివేయడంతో సాధారణ ప్రయాణికుల కష్టాలు అధికమయ్యాయి. దీంతో ఏ