ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్రస్థాయి నేతలు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 24, 2024, 08:47 PM

సోషల్ మీడియాలో తమ నేతలపై అసభ్య, అభ్యంతకర పోస్టులను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించడంలేదు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్రస్థాయి నేతలు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. రేపు (నవంబరు 25) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు మరో 15 మందికి కూడా నోటీసులు ఇచ్చారు. విజయవాడలో సజ్జల భార్గవరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు... భార్గవరెడ్డి అక్కడ లేకపోవడంతో అతని తల్లికి నోటీసులు అందించారు. అర్జున్ రెడ్డి కూడా నివాసంలో లేకపోవడంతో నోటీసులు ఇంటికి అంటించారు. కాగా, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా, ఇద్దరిపైనా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల కడప పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం తెలిసిందే. అతడిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలకు తాజాగా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com