మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వారు సైతం కొత్త పథకాల కోసం వేచి చూస్తుంటారు. మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లుగా రూపొందించే ఈ కొత్త స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తుంటాయని భావిస్తారు. అలాంటి వారందరికీ మంచి ఛాన్స్. ఈ వారం ఏకంగా 7 కొత్త పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏడు మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఎఫ్ఓలు సబ్‌స్క్రిప్షన్ ఓపెన్ అవుతున్నయి. ఆ లిస్ట్ ఓసారి పరిశీలిద్దాం.
మొత్తం 7 న్యూ ఫండ్ ఆఫర్స్‌లో మూడు థెమాటిక్ ఫండ్స్, రెండు ఇండెక్స్ ఫండ్స్, ఒక మల్టీ క్యాప్ ఫండ్, ఒక మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఉన్నాయి. ఈ ఫండ్స్ ఈ వారంలోనే సబ్‌స్క్రిప్షన్ ప్రారంభిస్తున్నాయి. అయితే, వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంటుందని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి. ఈ జాబితాలో మొదటగా కోటక్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కోటక్ ట్రాన్స్‌పొర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌కి వస్తోంది. ఈ ఫండ్ నవంబర్ 25వ తేదీన సబ్‌స్క్రిప్షన్ మొదలై డిసెంబర్ 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు యూనిట్ల కేటాయింపు తర్వాత క్రయ విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది.
ఇక టాటా మ్యూచువల్ ఫండ్స్ నుంచి టాటా బీఎస్ఈ సెలెక్ట్ బిజినెస్ గ్రూప్స్ ఇండెక్స్ ఫండ్ అందుబాటులోకి వస్తోంది. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 25వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 9వ తేదీతో ముగుస్తుంది. ఇక మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మరో కొత్త పథకం మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 26వ తేదీ మంగళవారం రోజున మొదలవుతుంది. డిసెంబర్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
ఇక గ్రో మ్యూచువల్ ఫండ్ నుంచి గ్రో మల్టీక్యాప్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 26వ తేదీన మొదలై డిసెంబర్ 10వ తేదీతో ముగుస్తుంది. ఇక డీఎస్‌పీ బిజినెస్ సైకిల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 27- డిసెంబర్ 11 తేదీల మధ్య అందుబాటులో ఉంటుంది. అలాగే ఇన్వెస్కో ఇండియా మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్కో ఇండియా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 27న మొదలై డిసెంబర్ 11న ముగుస్తుంది. చివరగా యూనియన్ యాక్టివ్ మూమెంటమ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 28న ప్రారంభమై డిసెంబర్ 12వ తేదీతో ముగుస్తుంది.