పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు శనివారం ప్రకటించాయి. 4న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు 22 వరకు కొనసాగనున్నాయి. 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరగనున్నందున 2వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఒకరోజు ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని సమాచారం.