ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడలో యువ డాక్టర్ ఆత్మహత్య,,,,భూమి విషయంలో వివాదాలే కారణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 26, 2023, 07:59 PM

కాకినాడలో యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడలోని అశోక్ నగర్‌కు చెందిన డాక్టర్ శ్రీ కిరణ్.. శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా.. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. శ్రీ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడటానికి అధికార పార్టీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వర్గానికి చెందిన వ్యక్తులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన కొడుకు చనిపోవడానికి భూ విక్రయానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలే కారణమని శ్రీకిరణ్ తల్లి శేషారత్నం ఆరోపించారు. ‘‘మా అబ్బాయి శ్రీకిరణ్ మెడిసిన్ చదువుకున్నాడు. వాళ్ల నాన్న చనిపోవడంతో ఇక్కడి వచ్చేశాడు. పొలం విషయంలో వివాదాలుంటే.. తేల్చుకోవాలనుకున్నాడు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తమ్ముడు కళ్యాణ్ పొలం తీసుకుంటానని చెప్పారు. మ్యాటర్ సెటిల్ చేస్తానని చెప్పి ఈ వ్యవహారాన్ని అచ్చంపేట పెదబాబు అనే వ్యక్తికి అప్పజెప్పారు. అయితే కత్తిపూడి దగ్గర్లోని చందుర్తిలోని మా 12.5 ఎకరాల పొలానికి సంబంధించి కాగితాలేం లేవు, ఇక డబ్బులు ఇచ్చేదేం లేదని పెదబాబు చెప్పారు. కూరాడలోని సైట్‌ను కూడా కన్నబాబు పీఏ బాలాజీకి విక్రయించాం. ఆయన సగం డబ్బులే ఇచ్చారు. ఈ విషయాలను కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే.. సెటిల్ చేస్తానని ఆయన చెప్పారు. కానీ చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన మా అబ్బాయి పురుగుల మందు తాగి చనిపోయాడు’’ అని శేషారత్నం ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com