ప్రధాని నరేంద్రమోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత మోడీకి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను టీటీడీ ఛైర్మన్ అందజేశారు. ప్రధాని హోదాలో తిరుమల శ్రీవారిని మోడీ దర్శించుకోవడం ఇది నాలుగోసారి.