నేడు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగంలో ఏవైతే సూచించారో వాటిని తూచతప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అని మేరిగ నాగార్జున అన్నారు. ముఖ్యంగా పేదరికాన్ని రూపుమాపి సమానత్వం అందరికి సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో జగన్ గారు పనిచేస్తున్నారన్నారు. బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో అత్యధికమందికి చోటుకల్పించారన్నారు. మండల,గ్రామ,పట్టణ స్దాయిలో అన్ని పాలకవర్గాలలో సైతం ఇదే సిధ్దాంతాన్ని అనుసరించారన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తున్నది జగన్ గారు మాత్రమేనన్నారు.గతంలో చాలా ప్రభుత్వాలు ఉన్నా వారు అంబేద్కర్ భావజాలాన్ని కేవలం మాటలకే పరిమితమయ్యారన్నారు. చంద్రబాబు హయాంలో రాజ్యాంగాన్ని,అంబేద్కర్ భావజాలాన్ని అవహేళన చేసేవిధంగా అవమానించేవిధంగా వ్యవహరించారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాచారన్నారు.ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించారన్నారు.