సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి హాజరయ్యారు. చంద్రబాబు దంపతులను సిద్ధార్థ లూథ్రా రిసీవ్ చేసుకున్నారు. అంతకు ముందు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు దంపతులకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు తదితరులు స్వాగతం పలికారు.