ప్రధాని నరేంద్రమోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత మోదీకి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను టీటీడీ ఛైర్మన్ అందజేశారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందే మోదీ శ్రీవారిని దర్శించుకొని అతిధిగృహం చేరుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణ బయల్దేరి వచ్చారు. 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థించానని ప్రధాని మోదీ తెలిపారు.