రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదనే కారణంతో కన్నతల్లిని ఓ కసాయి కొడుకు కడతేర్చాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది.
రుచికరమైన ఆహారం పెట్టలేదని తల్లితో కొడుకు గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహంతో మెడపై కొడవలితో దాడి చేశారు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.