ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబైలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. ఆ ఉగ్రవాది ఏక్తానగర్లో తలదాచుకున్నాడని చెప్పాడు.
అయితే విచారణ జరిపిన పోలీసులకు రాంగ్ కాల్ అని అర్థమైంది. దాంతో కాల్ చేసిన లక్ష్మణ్ నానావరే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.