కాకినాడలో విద్యార్థులకు పెను ప్రమాదమే తప్పింది. చెత్త తగలబెట్టే క్రమంలో పేలుడు సంభవించడంతో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పంచాయతీ సిబ్బందికి తెలియకుండానే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తను తగలబెట్టారు. అదే సమయంలో ఏలేరు కాలువలో స్నానాలు చేయడానికి రాగా ఒక్కసారిగా పేలడంతో గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికులు ప్రతిపాడు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.