సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసుపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది.
ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఇటీవల జగన్ పిటిషన్ దాఖలు చేయగా నిన్న ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.