ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్, డీఎంకే గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకే నష్టమని CM చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 'ఇలా మాట్లాడుతున్నందుకు నాపై దక్షిణ ప్రాంత వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారు. ఈ రాష్ట్రాలకు నేనెందుకు అన్యాయం చేస్తాను? 2001లో వాజ్ పేయి హయాంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఈ ప్రాంతానికి నష్టమని ఆపించాను. 'ఇండీ' పార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలి' అని ఆయన వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa