ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిలక్ వర్మ అరుదైన రికార్డు

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 21, 2026, 10:28 AM

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఆటగాడు, తెలుగు యువ సంచలనం తిలక్ వర్మ గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు. 45 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తిలక్, ప్రత్యర్థి జట్టు మొత్తం చేసిన 100 పరుగుల కంటే ఎక్కువ స్కోరు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాటర్ తన సెంచరీతో ప్రత్యర్థి జట్టు స్కోరును దాటడం ఇది 9వ సారి. ఈ ఘనత సాధించిన దిగ్గజాల సరసన తిలక్ చేరాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa