ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై హైకోర్టులో విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 11:00 AM

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. తమ సొంత కంపనీతో పాటు టిడిపి నాయకులకు లబ్ది చేకూర్చేందుకు రింగ్ రోడ్డు చంద్రబాబు అలైన్ మెంట్ లో మార్పులు చేసారని వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై సిఐడితో  విచారణ చేయిస్తున్న జగన్ సర్కార్ చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ పైనా కేసు నమోదు చేసారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా వుండేందుకు ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలుచేసిన పిటిషన్ పై ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం  విచారించనుంది.
ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా దాన్ని హైకోర్టులో కొట్టేసింది. అరెస్ట్ కాకుండానే సాధారణ బెయిల్ పై విచారణ జరపలేమంటూ ఆ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో చంద్రబాబు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం మరో పిటిషన్ ను దాఖలు చేసారు. నేడు ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. ఇక ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును విచారించేందుకు విజయవాడ ఏసిబి కోర్టులో పిటి వారెంట్స్ దాఖలుచేసింది సిఐడి. దీనిపై ఇవాళ ఏసిబి కోర్టులో విచారణ జరగనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com