అమెరికాలోని పలు ఆసుపత్రులపై సైబర్ దాడి జరిగింది. దీంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. అర్డెంట్ హెల్త్ సర్వీసెస్ న్యూజెర్సీ మరియు న్యూ మెక్సికోలో 20కి పైగా ఆసుపత్రులకు సేవలు అందిస్తోంది.
ఇటీవల సైబర్ నేరగాళ్లు ఆసుపత్రుల మెడికల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను హ్యాక్ చేశారు. దీంతో ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీనిపై సంస్థ స్పందిస్తూ.. సాఫ్ట్‌వేర్ సేవలను పునరుద్ధరించేందుకు తమ సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.