చైనాలో కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇటీవల దీనిపై స్పందించింది. రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యాణా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. రాష్ట్రంలో శ్వాసకోశ సమస్య కేసులపై నిఘా పెట్టాయి.