రైతులకు డ్రోన్లు అద్దె ప్రాతిపదికన ఇచ్చే స్కీమ్‌కు కేంద్రం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం కేంద్ర మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఈ డ్రోన్లను ఎంపిక చేసిన మహిళా స్వయం సహాయక బృందాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2023-24 నుండి 2025-2026 మధ్యకాలంలో ఎంపిక చేసిన 15,000 డ్రోన్లు అందిస్తామని వెల్లడించారు. ఇందుకోసం 5 రోజుల శిక్షణ ఇస్తామన్నారు.