స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 728 పాయింట్లు లాభపడి 66,902 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పుంజుకుని 20,097 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : యాక్సిస్ బ్యాంక్ (3.92%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.38%), విప్రో (2.32%), టాటా మోటార్స్ (2.09%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.94%).
టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-0.57%), టైటాన్ (-0.49%), బజాజ్ ఫిన్‌సర్వ్ (-0.34%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.07%).