తిరుమల శ్రీవారికి నిత్యం భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు టీటీడీ ట్రస్టులకు విరాళాలను అందజేస్తుంటారు. కొందరు భక్తులు స్వామివారి నిత్యన్నదానానికి కూడా కూరగాయలు అందిస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లా పోరం నుంచి భక్తులు స్వామివారి నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయలను పంపించారు బొప్పన కృష్ణ, మాధురీదేవి దంపతులు. మంగళవారం ఉదయం తమ ఇంటి దగ్గర లారీకి పూజలు నిర్వహించి.. తిరుమలకు పంపించారు. తిరుమల శ్రీవారి నిత్యాన్నదానానికి కూరగాయలు అందించడం తమ పూర్వ జన్మ సుకృతమని అన్నారు కృష్ణ, మాధురీదేవి దంపతులు. మండవ కుటుంబరావు తమకు ఆప్తులని, ఆయన మరణానంతరం ఆ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. సన్నిహితులు ఈ కార్యక్రమం చేయించారన్నారు. చాలామంది భక్తులు తిరుమల శ్రీవారి నిత్యన్నదానానికి తమకు తోచిన కానుకల్ని అందజేస్తుంటారు. కొందరు బియ్య, ఇతర సామాన్లు పంపిస్తుంటారు.. మరికొందరు కూరగాయలు, పాల వంటివి కూడా అందిస్తుంటారు.