బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని వాతవరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని తెలిపింది.
ఈ క్రమంలో డిసెంబర్ 2న ‘మిచాంగ్’ తుపానుగా మారనుందని వివరించింది. దీని ప్రభావంతో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.