దేశంలోనే తొలిసారిగా ఓ మహిళ గవర్నర్ ఏడీసీగా నియమితులయ్యారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం తన ఏడీసీగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2015 బ్యాచ్‌కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధిని నియమించారు.
త్రివిధ దళాలకు చెందిన అధికారిని ఏడీసీగా నియమించే అధికారం దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లకు ఉంటుంది. దీనికి సంబంధించిన బలగాలు ప్యానెల్‌ను ప్రతిపాదిస్తాయి.