ఓ స్వామీజీనీ భక్తులు కారంతో శరీరానికి నలుగు పెట్టినట్లు అభిషేకించిన ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగింది. సుమారు 60 కేజీల కారంతో శివ స్వామిని అభిషేకించారు భక్తులు.
ప్రత్యంగిరి ఆవాహనలో ఉన్న శివ స్వామిని అభిషేకిస్తే వారికి బాధలు, కష్టాలు తొలగి శత్రువినాశనం జరిగి, లక్ష్మీ కటాక్షం పొందుతారని నమ్మకమట. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు.