చేబ్రోలు మండలం నారాకోడూరు వద్ద జి బి సి రోడ్డు ప్రధాన రహదారిపై బుధవారం పెదకాకాని ప్రాంతానికి చెందిన కారు మెకానిక్ షేక్ కరిముల్లా(26) పొన్నూరు లోని తన స్నేహితులను కలిసి తిరిగి ప్రయాణమై పెదకాకాని బయలుదేరాడు.
మార్గం మధ్యలో నారాకోడూరు కారం మిల్లు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.