చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసి నగదు రికవరీ చేసినట్లు ఎస్ఐ ఏ బాలకృష్ణ బుధవారం తెలిపారు. నకరికల్లు మండలంలోని దేచవరం గ్రామంలో సెప్టెంబర్ 6వ తేదీన మణికంఠ పెస్టిసైడ్స్లో చోరీకి పాల్పడి రూ. 1. 50 లక్షల నగదు అపహరించారని అన్నారు.
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించామన్నారు.